కలెక్టరేట్‌లో ఘనంగా ఏడో రోజు బతుకమ్మ సంబరాలు

16-10-2026 | 08:40pm

మహబూబ్‌నగర్, (విజయక్రాంతి): జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం ఏడో రోజు బతుకమ్మ సంబరాలను(Bathukamma celebrations) ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా(District Collector Khushboo Gupta), దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొని వేడుకలను ప్రారంభించారు. వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగినులు(Female employees) రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీక అని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ బతుకమ్మ, దసరా పండుగలను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, సహాయ కలెక్టర్ సాయి శివాని, జిల్లా రెవెన్యూ అధికారి ఏ. నిర్మల, వివిధ శాఖల అధికారులు, మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు