కామారెడ్డి ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఎన్. అంజయ్య
23-11-2026 | 05:14pm
కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి రోడ్లు భవనాల శాఖ(Kamareddy Roads and Buildings Department) (ఆర్ అండ్ బీ) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా ఎన్. అంజయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు కామారెడ్డి డివిజన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (టెక్నికల్)గా విధులు నిర్వహించిన అంజయ్య, పదోన్నతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.