ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం
దోమకొండ, నవంబర్ 23 (విజయ క్రాంతి): పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Family Life Insurance Scheme) కార్యక్రమాన్ని అంచనూర్ గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు పథకం ఉద్దేశాలు, ప్రయోజనాలపై వివరించారు.
అర్హులైన కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనగామ నరేష్, ఎంపీఓ రవికుమార్, ఉపసర్పంచ్ కందుకూరి ప్రభాకర్, వార్డు సభ్యులు నీరడి రాజశేఖర్, జనగామ నవీన్, తెడ్డు స్వప్న, నాగరపు పద్మ, గుడ్డి బాగానీ, నర్సవ్వ, పంచాయతీ కార్యదర్శి పద్మ, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.