వస్పుల హాస్టల్‌లో ఉచిత వైద్య శిబిరం

23-11-2026 | 12:22pm

మిడ్జిల్, నవంబర్ 23 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని వస్పుల ఎస్సీ హాస్టల్‌లో ఉచిత వైద్య శిబిరం (Free Medical Camp) నిర్వహించారు. ఈ శిబిరంలో 111 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యక్తిగత ఆరోగ్యం (Personal Hygiene), పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటిస్తూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మీర్జా అలీ, సీహెచ్‌ఓ అయ్యుబ్ ఖాన్, హాస్టల్ వార్డెన్ రవికుమార్, ఆరోగ్య సిబ్బంది సంపత్ కుమార్, పారిజాత, ఆశ కార్యకర్త లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు