108 వాహనంలో కవల పిల్లల జననం

23-11-2026 | 12:16pm

కన్నాయిగూడెం, నవంబర్ 23 (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఏటూరు గ్రామపంచాయతీ పరిధిలోని సింగారం గ్రామానికి చెందిన మడకం ఇడిమి (27)కు 108 వాహనంలో పండంటి కవల మగ పిల్లలు జన్మించారు. సోమవారం తెల్లవారుజామున ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం అందించారు.

దీంతో స్పందించిన 108 సిబ్బంది ఈఎంటీ పార్వతల రాజ్‌కుమార్, పైలట్ సురేష్ హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. బాధితురాలికి నొప్పులు అధికం కావడంతో పరిస్థితిని గుర్తించిన ఈఎంటీ రాజ్‌కుమార్ సమయస్ఫూర్తితో వాహనంలోనే ప్రసవం చేశారు. ఈ క్రమంలో ఆమె ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది.

అనంతరం తల్లీబిడ్డలకు ప్రథమ చికిత్స అందించి ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి తల్లీబిడ్డలను కాపాడిన 108 సిబ్బందికి ఇడిమి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు