అక్రమ ఇసుకపై తనిఖీలు కొనసాగేనా?

23-10-2026 | 05:35am
  1. ఎప్పుడో ఒకప్పుడు అధికారుల హడావుడి!
  2. అర్ధరాత్రి సీసీ కుంటలో అక్రమ ఇసుక నిలుల సీజ్ 
  3. నామమాత్రంగానే తనిఖీలు అంటున్న జనం 
  4. అనుమతి లేనిది ఇసుక తరలించొద్దు : ఎల్లయ్య, తాసీల్దార్ చిన్నచింతకుంట 

చిన్న చింతకుంట అక్టోబర్ 22 : అక్రమంగా ఇసుక(Illegal Sand Mining) తరలింపు ప్రక్రియ ఈనాటిది కాదు నానాటి నుంచి వస్తున్న ఆచారంగా నడుస్తుంది. ఈ విషయం అధికారుల అందరికీ తెలిసినప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు తనిఖీలు చేపడుతున్నాం? చర్యలు ఉంటా యి అంటూ అల్టిమేటం జారీ చేస్తూ అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను సీ జ్ చేసి మరోసారి ఇలా చేయకూడదు అం టూ హెచ్చరించడం మనం చూస్తుంటాం. ఇటీవల కూడా సిసి కుంట మండల పరిధిలోని ఆయా గ్రామాలలో నిలువచేసిన ఇసుకను సీజ్ చేసి ఇందిర మ్మ ఇండ్లకు తరలించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో నిలుపుదల చేసే పరిస్థితి లేదని జనం చెబుతున్న మాట. ఇష్టనుసారంగా ఇసుక తరలింపు చేయడం భూగర్భ జలాల అడుగంటిపోయేందుకు అధికారులు కూడా కారణమే అంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తుండ్రు. 

తనిఖీలు తాత్కాలికమైనా?

వాగుల్లో ఇసుక తరలించకూడదు మహాప్రభో అంటూ వేడుకుంటున్నప్పటికీ రైతుల మాట అస్సలు పట్టించుకోకుండా ఇసుక వ్యాపారులకే మద్దతు తెలియజేస్తూ అధికారులు పర్యవేక్షణ చేయడం లేదంటూ మం డలంలోని పలు గ్రామాల ప్రజలు చెబుతు న్న మాట. అసలే నీటి ఎద్దడి ఏర్పడి తీవ్ర ఇబ్బందులకు ఎదురవుతున్నా విషయాన్ని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సైతం చెబుతున్నప్పటికీ ఇసుక అక్రమంగా తరలింపు ప్రక్రియ మాత్రం అస్సలు ఆగడం లేదంటూ జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనై నా ఎట్టి పరిస్థితుల అక్రమంగా ఇసుక తరలింపు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, దీంతో కొంతలో కొంతైనా నీటి ఎద్దడి కొంచెం నివారించేందుకు అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. 

అక్రమంగా ఇసుక తరలిస్తే సమాచారం ఇవ్వండి

 ఎవరైనా అక్రమంగా ఇసుక తరలింపు చేసినట్లయితే ఎవరైనా సమాచా రం అందించాలి. అనుమతి లేనిది ఎవ రు కూడా ఇసుక తరలించకూడదు. నిర్లక్ష్యంగా ఉంటూ ఇష్టానుసారంగా ఇసుక తరలింపుకు ముందుకు సాగితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

  ఎల్లయ్య, తహసీల్దార్ 

చిన్నచింతకుంట మండలం.

మరిన్ని వార్తలు