ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
మహబూబ్నగర్ జిల్లా,మహమ్మదాబాద్,అక్టోబర్ 17: విజయక్రాంతి : మహమ్మదాబాద్ మండల(Mahammadabad Mandal) కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నికల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బాల్రాజ్(Balraj as Press Club President), గౌరవ అధ్యక్షుడిగా నాగరాజ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా గూళ్ల దస్తయ్య, బి.గోవర్ధన్, ట్రెజరర్గా హనుమంతు ఎన్నికయ్యారు. సలహాదారులుగా.కొత్త గోపాల్ విరాజి,రామకృష్ణారెడ్డి,ఎస్.రాజు, రవి డి.ఆంజి.మహేందర్,రమేష్, మల్కయ్య, మనోహర్,గౌరీశంకర్, కేశవులు,రాములు ఎన్నికైనట్లు తెలిపారు.
నూతన కార్యవర్గం మండలంలో జర్నలిస్టుల ఐక్యతకు, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.