ధ్వజస్తంభ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొన్న ఎంపీ
16-10-2026 | 12:47pm
రాజాపూర్: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యలని ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) అన్నారు. శుక్రవారం మండలంలోని చొక్కంపేట్(Chokkampet) గ్రామంలోని శ్రీ స్వయంభు లక్ష్మి తిరుమలానంద స్వామి(Sri Swayambhu Lakshmi Tirumalananda Swamy) ధ్వజస్తంభ ప్రతిష్ట వేడుకల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవాలయాలు కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అలివేలు, అభిమన్యు రెడ్డి, రామకృష్ణ, నర్సింలు, ఆదిత్య, నరసింహులు, తదితరు పాల్గొన్నారు.