కమీషన్ల అడ్డాగా సీఎం ఆఫీస్

16-10-2026 | 05:35am

కాంగ్రెస్‌ది పచ్చి దోపీడి, లూటీ పాలన

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణ సీఎం కార్యాలయాన్ని కమీషన్లకు అడ్డాగా మార్చేశారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ పనికి 15 శాతం కమీషన్ కావాలంటూ నేరుగా సీఎంఓ నుంచే బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమంటూ గురువారం ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదు.. పచ్చి దోపిడీ, లూటీ పాలన అని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఈ అరాచకాలను సహించదని హెచ్చరించారు.

ప్రజలకు, వ్యాపారులకు రక్షణగా ఉండాల్సిన సీఎం, ఆయన ఆఫీస్ నుంచే ఇలాంటి ఆగడాలు జరగటమేంటనీ ప్రశ్నించారు. ప్రజలను దోచుకుంటూ కమీషన్ల కోసం బెదిరింపులకు పాల్పడుతున్న వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని లేదని, తాము అధికారంలోకి వచ్చాక ఈ లూటీకి పాల్పడిన వాళ్లందరిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళా రైతుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధంగా ‘మహిళా రైతుల సాధికారిత’ చట్టాన్ని తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు