కన్నీటి మధ్య.. రెండు జీవితాలకు వెలుగు!

01-10-2026 | 02:33pm

మహబూబ్‌నగర్ (విజయ క్రాంతి): నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామానికి చెందిన వేపూరి నవీన్ ఓ ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తూ బుధవారం ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గురువారం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించే సమయంలో నవీన్ నేత్రాలను దానం చేయాలని ఎస్సై నాగన్న ఆయన తల్లిదండ్రులకు వివరించారు.

నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరికి చూపు లభించడంతో పాటు, వారి కళ్లలో నవీన్ జీవించి ఉంటాడని ఎస్సై వివరించారు. దీంతో తల్లిదండ్రులు నేత్రదానానికి ముందుకు వచ్చారు. నేత్రదానం (EYE DONATION) చేయడం ద్వారా మరొకరికి చూపును అందించవచ్చనే విషయాన్ని తెలుసుకున్న వారు, తీవ్ర విషాదంలోనూ కుమారుడి నేత్రాలను దానం చేసేందుకు అంగీకరించారు.

పుట్టెడు శోకంలోనూ కుమారుడి నేత్రాలను దానం చేసిన తల్లిదండ్రులు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. వారి నిర్ణయం (DECISION) పట్ల పలువురు అభినందనలు తెలిపారు. నవీన్ నేత్రాలను వైద్య సిబ్బంది (MEDICAL STAFF) సేకరించి భద్రపరిచినట్లు తెలిపారు. తల్లిదండ్రుల మానవతా దృక్పథం (HUMANITY) పలువురికి స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు