టీపీసీసీసీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కాంపల్లి సతీష్

01-10-2026 | 03:03pm

బెల్లంపల్లి:  బెల్లంపల్లి పట్టణానికి చెందిన కాంపెల్లి సతీష్‌ టీపీసీసీ ఎస్సీ సెల్ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల నర్సింగ్‌ (SC Cell Chairman Paidimala Narsing) నియామక పత్రాన్ని అందజేశారు. మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల నర్సింగ్‌కు సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. సతీష్ నియామకంపై బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు