నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు

11-09-2026 | 11:06pm

రాజకీయ పరిజ్ఞానం కోసం పార్లమెంట్ నిర్వహణ

రాజాపూర్ : విద్యార్థులకు రాజకీయ పరిజ్ఞానం కోసమే నమూనా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించినట్లు ప్రధాన ఉపాధ్యాయుడు సయ్యద్ ఇబ్రహీం తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా ఉన్నత పాఠశాల లో విద్యార్థులే ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా వ్యవహరించి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు ఎలా రూపొందుతాయి, చర్చలు ఎలా జరుగుతాయి మరియు సభ ఏ విధంగా నడుస్తుందో ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడానికి పార్లమెంట్ నిర్వహించినట్లు తెలిపారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని రాజాపూర్ మండల విద్యాశాఖాధికారి సుధాకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజాపూర్ సర్పంచ్ కావలి రామకృష్ణ, రంగారెడ్డి గుడా ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి మరియు రాజాపూర్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు