గోవిందరాజుల స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

18-09-2026 | 03:16pm

చందుర్తి,సెప్టెంబర్ 18,(విజయక్రాంతి) : మండలంలోని సనుగుల గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల స్వామి (sri sridevi bhudevi sametha govindarajula swami) వారిని ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ (Vemulawada MLA Adi Srinivas)తన జన్మదిన సందర్భంగా దర్శించుకున్నారు.. 

ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ కు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు..ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుకోవాలని అలాగే మరెన్నో పదవులు చేపట్టి ప్రజా సేవచేయలని కోరుకున్నారు.శ్రీ గోవిందరాజుల స్వామి ఆశీస్సులతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు