జడ్చర్ల డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన దినోత్సవం

17-09-2026 | 09:56pm

జడ్చర్ల, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని(Public Governance Day) ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సుకన్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని వివరించారు. చరిత్ర అధ్యాపకులు రాఘవేంద్ర రెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో జడ్చర్ల, అప్పంపల్లి, మన్ననూర్ తదితర ప్రాంతాల పాత్రను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు