ఆటల్లోనూ ఆణిముత్యాలు - రాజాపూర్ విద్యార్థులు

12-10-2026 | 11:37pm

రాజాపూర్: మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District) కేంద్రంలో నిర్వహించినటువంటి ఖోఖో జూనియర్స్ విభాగం(Kho-Kho Juniors Section)లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి సరూర్ నగర్ లో జరిగేటువంటి పోటీలకు అర్హత సాధించిన రాజాపూర్ 9వ తరగతి విద్యార్థి జస్వంత్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఇబ్రహీం ప్రత్యేకంగా అభినందించారు.

క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థి జశ్వంత్ ను ప్రోత్సహిస్తూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని  తెలిపారు. రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షిచారు., విద్యార్థులు క్రీడల్లో రాణించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఫిజికల్ డైరెక్టర్ వెంకటమ్మ, స్పోర్ట్స్ కోచ్ ప్రకాష్ రాజ్ ను  ప్రధానోపాధ్యాయులు  ఉపాధ్యాయ బృందము అభినందించారు.

మరిన్ని వార్తలు