మానవత్వం చాటిన శ్రీకృష్ణ కుచేల మిత్రబృందం
చిన్ననాటి స్నేహితురాలికి రూ.10 వేల ఆర్థిక సాయం
గండీడ్, నవంబర్ 6 (విజయక్రాంతి): చిన్ననాటి స్నేహబంధానికి ఆర్థిక చేయూతనిస్తూ శ్రీకృష్ణ కుచేల మిత్రబృందం మానవత్వాన్ని చాటుకుంది. మండలంలోని వెన్నచేడ్ గ్రామానికి చెందిన తమ చిన్ననాటి స్నేహితురాలు మల్లీశ్వరి(Malleswari) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మిత్రబృందం సభ్యులు ఆమెకు అండగా నిలిచారు.
మల్లీశ్వరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైద్య ఖర్చులకు తోడ్పాటుగా బృందం తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆపద సమయంలో స్నేహితురాలికి అండగా నిలిచి నిజమైన స్నేహబంధాన్ని చాటుకున్నారు. మల్లీశ్వరి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మిత్రబృందం సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వరుణ్, నిరంజన్, గణేష్, రాహుల్, శేఖర్, నాగలింగం, కృష్ణ, అనిల్, వెంకట్ రాములు, కేశవులు, హరీష్, నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.