ఎంఎస్ఎఫ్ మండల కమిటీ ఎన్నిక
వెంకటాపూర్, నవంబర్ 06 (విజయక్రాంతి): మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ మండల(MRPS Mandal) అధికార ప్రతినిధి గడ్డమీది అశోక్ అధ్యక్షతన నూతన ఎంఎస్ఎఫ్ మండల కమిటీని(MSF Mandal Committee) ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి జిల్లా కో-ఇంచార్జి కాడపాక శ్యామ్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కుల సాధన(Achieving Students' Rights), విద్యారంగంలో(Education Sector) సమాన అవకాశాలు, సామాజిక న్యాయం(Social Justice), రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఎంఎస్ఎఫ్ ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని, విద్యార్థులు చదువుతో పాటు సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలని, వారి సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ నిరంతరం కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా నూతన మండల కమిటీ అధ్యక్షుడిగా బోయిని శివ, ఉపాధ్యక్షుడిగా మైస హరి ప్రసాద్, అధికార ప్రతినిధిగా కాడపాక తనుష్, కోశాధికారిగా చందు, కార్యదర్శిగా సిరిపెల్లి లక్కీ ఎన్నికయ్యారు. నూతన కమిటీ విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ వారి హక్కుల సాధనకు కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గడ్డమీది దేవేందర్, రాసపల్లి రిశ్వంత్, సామర్ల ప్రశాంత్, రామ్ చరణ్, హర్షిత తదితరులు పాల్గొన్నారు.