కరెంట్ ఇవ్వని కాంగ్రెస్

25-09-2026 | 05:10am
  1. విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వమే కారణం
  2. విద్యుత్ ప్లాంట్లను నిర్వీర్యం చేస్తున్నారు 
  3. సర్కారు తీరుతోనే సాగునీటి సమస్య 
  4. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు
  5. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్ల సందర్శన
  6. కొన్ని చోట్ల అడ్డుకున్న పోలీసులు
  7. బీఆర్‌ఎస్ నేతల ఆందోళనలు

బొగ్గు సరఫరా చేయని కారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు గడ్డుకాలం నెలకొన్నదనంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పిలుపు మేరకు గురువారం రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్ల సందర్శనకు బీఆర్‌ఎస్ నేతలు వెళ్లారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకోవడంతో ప్లాంట్ల వద్ద నిరసన తెలిపారు.

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి(Former Minister Jagadish Reddy) నేతృత్వంలో బీఆర్‌ఎస్ బృందం పరిశీలించింది. వీరికి తోడుగా పార్టీ కార్యకర్తలు, రైతులు, పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివ చ్చారు. ప్లాంట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు(Former Minister Errabelli Dayakar Rao), సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి భూపాలపల్లి కేటీపీపీ సందర్శనకు వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ కేంద్రాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బృందం, హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, శంబిపూర్ రాజులను పోలీసులు అనుమతించకపోవడంతో తోపులాట చోటుచేసుకుంది.

  1. ఇళ్లు, పరిశ్రమలలో జనరేటర్లు వాడే పరిస్థితి
  2. సింగరేణిలో బొగ్గు సిద్ధంగా ఉన్నా కొరత ఉందంటున్నరు
  3. కరెంటు ఇవ్వకుంటే పదవుల నుంచి తప్పుకోవాలి
  4. పవర్ ప్లాంట్ల సందర్శనలో బీఆర్‌ఎస్ నేతలు

మంచిర్యాల/భద్రాద్రి కొత్తగూడెం/దామరచర్ల/గణపురం, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో కరెంట్ ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ సర్కార్(Congress government) ఉన్నదని, ప్రభుత్వ విధానా ల వల్లే రాష్ర్టంలో విద్యుత్, సాగునీటి సమస్యలు ఏర్పడ్డాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు విమర్శించారు. బొగ్గు సరఫరా చేయని కారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు గడ్డుకాలం నెలకొన్నదని విమర్శించారు. బీ ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్ల సందర్శనకు బీఆర్‌ఎస్ నేతలు వెళ్లా రు.

ఈ క్రమంలో కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకోవడంతో ప్లాంట్ల గేట్ల వద్ద నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మం డలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్ బృందం పరిశీలించింది. వీరికి తోడుగా మండలంలోని పార్టీ కార్యకర్తలు, రైతులు, పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్లాంట్‌లోకి వెళ్లేందుకు ప్ర యత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. లోనికి వెళ్లిన బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం అధికారులతో సమావేశమై విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడానికి గల కారణాలపై చర్చించింది. అనంతరం మీడియాతో జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతాంగానికి 2014 పూర్వపు స్థితి పునరావృతం కానున్నట్లు చెప్పారు. ఇళ్లలో, పరిశ్రమలలో జనరేటర్లు వాడే పరిస్థితులు రానున్నట్లు పేర్కొన్నారు.

రైతులు డీజిల్ జనరేటర్లు వాడే పరిస్థితి రావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రితో సహా అన్ని విద్యుత్ ప్లాంట్లు విద్యుత్తు ఉత్పత్తికి సి ద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేద ని అన్నారు. ప్రభుత్వం రైతులు, ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ డ్రామాలు ఆడుతున్నదని వి మర్శించారు. కరెంట్, నీళ్లు ఇవ్వకుండా ఇ బ్బంది పెడుతున్నదిన మండిపడ్డారు. సింగరేణిలో 9 గ్రేడ్ బొగ్గు సిద్ధంగా ఉన్నా కొరత ఉన్నదని చెప్పడం సరైంది కాదన్నారు. మం చి బొగ్గును కర్ణాటక, ఏపీ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రూ. 40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందని ఆరోపించారు.

అత్యుత్తమ సాంకేతికతతో యాదాద్రి ప్లాంట్‌ను తమ ప్రభుత్వం నిర్మించినట్లు చెప్పారు. ఇక్కడ మరో 4 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. మరికొంత బొగ్గు కూడా వస్తున్నట్లు అధికారులు చెప్పారని అన్నారు. ప్రస్తుతం 3 యూనిట్లు నడుస్తున్నాయని, అందులో ఒకటి చిన్న సమస్యతో ఆగిపోతే సరిచేసినట్లు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో మరొకటి కూడా ఉత్పత్తిలోకి వస్తుంది చెప్పారు. ప్లాం ట్ నిర్మాణ సమయంలో భూములు కోల్పోయిన వారితో పాటు, స్థానికులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పామని గుర్తు చేశారు.

అప్పుడు ఎంతో మంది ముందుకు వచ్చి ప్లాంట్ నిర్మాణానికి భూ ములు ఇచ్చారని చెప్పారు. తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పక్క రాష్ట్రాల వారికి లక్షలాది రూపాయలకు ఉద్యోగాలను అమ్ముకున్నట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారి జాబితాను బయ ట పెట్టాలని డిమాండ్ చేశారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించేంత వరకు పోరాడతామని హెచ్చరించారు. వారివెంట జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలు నాయక్, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, భూపాల్‌రెడ్డి, విజయ సింహరెడ్డి, భిక్షమయ్య, భగత్ ఉన్నారు. 

కేటీపీఎస్, బీటీపీఎస్ వద్ద ఆందోళన

భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కొత్తగూ డెం థర్మల్ పవర్ స్టేషన్‌ను రాజ్యసభ సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బృందం, హైదరాబాద్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, శంబి పూర్ రాజు సందర్శించారు. పోలీసులు అనుమతించకపోవడంతో కొద్దిసేపు పోలీసులకు, బీఆర్‌ఎస్ నాయకులకు మధ్య తోపు లాట చోటుచేసుకుంది.

కేటీపీఎస్‌ను సందర్శించిన అనంతరం వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. థర్మల్ పవర్ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు లేవని, ఒక్కొక్క కర్మాగారంలో 21 రోజుకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉండగా, కేవలం ఒకటి, రెండు రోజులు సరిపడా బొగ్గు మాత్రమే ఉన్నదని, కర్మాగారాలకు సరఫరా చేసే బొగ్గు నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత థర్మల్ పవర్ స్టేషన్లో నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారిందని ధ్వజమెత్తారు. రైతులకు సాగునీరు విద్యుత్ అందించకుంటే పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

గృహ, వ్యవసాయ, పరిశ్రమల అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు, గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, పట్టణ అధ్యక్షులు రాజు గౌడ్, మున్సి పల్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. కాగా కేటీపీఎస్ సందర్శన సందర్భంగా మీడియాను కర్మాగారంలోనికి అనుమతించకపోవడం శోచనీయం. అధికారుల తీరును నిరసిస్తూ కర్మాగారం వద్ద మీడియా ప్రతినిధులు ధర్నా చేశారు. 

ఎస్టీపీపీ వద్ద

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు (ఎస్టీ పీపీ) ముందు మాజీ ప్రభుత్వ విప్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ఆసిఫా బాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామ న్న, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, ఖానాపూర్ బీఆర్‌ఎస్ పా ర్టీ ఇన్‌చార్జి భుక్యా జాన్సన్ నాయక్, కౌశిక్ హరి, మూల రాజిరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకు లు, రైతులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు రెండు పంటలకు సాగునీరు విడుదల చేయాలని, వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 1200 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు సరఫరాలో నిర్లక్ష్యం చేస్తూ విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తోందని ఆరోపించారు. రైతులకు సాగు సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, రెండు పంటలకు అవసరమైన సాగునీటిని తక్షణమే విడుదల చేయాలని డిమాం డ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని, పంటలు ఎండిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. 

కేటీపీపీ వద్ద ఆందోళన

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో భూపాలపల్లి జిల్లాలోని కేటీపీపీ సందర్శనకు బీఆర్‌ఎస్ నేతలు వెళ్లారు. వారిని పోలీసులు ప్లాంట్‌లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో ప్రధాన ద్వారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరూరి రమేష్, శంకర్‌నాయక్, బడే నాగజ్యోతి కేటీపీపీ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు.

అనంతరం బీఆర్‌ఎస్ నేతలను సొంత పూచీకత్తుపై ప్లాంట్‌లోకి అనుమతించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందించామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కేటీపీపీ, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గు అందించకుండా ఉత్పత్తిని దెబ్బతీస్తోందని ఆరోపించారు. జెన్‌కో బకాయిలు చెల్లించి విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గోదావరి నీటిని వినియోగించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులకు విద్యుత్, సాగునీరు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని, చేతకాకపోతే పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు