సర్కార్ బడుల్లో అందని బ్రేక్‌ఫాస్ట్..!

25-09-2026 | 05:35am

బోధన్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల(Government Schools)ల్లో విద్యార్థులకు అల్పాహారం అందడం లేదు. జిల్లాలో 975 స్కూళ్లలో నో బ్రేక్ ఫాస్ట్ కావడంతో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. స్వయానా సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ప్రతి విద్యార్థికి అల్పాహారం అందించేందుకు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేటికి రెండు నెలలు గడుస్తున్నా పథకం ప్రారంభానికి నోచుకోలేదు. అల్పాహారంలో భాగంగా విద్యార్థులకు రాగిజావ, పూరి, ఇడ్లీ, చపాతి, దోశ ఇలా అన్ని అందిస్తామని చెప్పిన ఇంకా ఆచరణలోకి రావడం లేదు.

స్కూళ్లలో నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్ అందించడానికి స్థానిక రైతుల నుంచి నేరుగా ఆర్గానిక్ కూర గాయలు, వస్తువులను సేకరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో1165 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 1,27,026 మంది విద్యార్థిని విద్యార్థులు, విద్యనభ్యసిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 975 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 82,372 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం మధ్యాహ్న భోజనంతో సరిపెడుతున్నారు.

ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ పెడితే ఆకలితో ఇబ్బందులు పడే వి ద్యార్థులు బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో సీఎం పథకం ప్రారంభించినప్పటికీ అమలుకు నోచుకోవట్లే దు. బ్రేక్ ఫాస్ట్ అందించి మధ్యాహ్నం భోజన పథకం మీల్స్ అందిస్తూ వారి ఆరోగ్యంతో పాటు మంచి భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మన్ననలు పొందినప్పటికీ అమలైతే బాగుంటుందని  ఉపాధ్యాయులు సైతం పేర్కొంటున్నారు.

ఆశ కల్పించి..

విద్యార్థులకు అల్పాహారంపై ఆశలు లేకున్నప్పటికీ వారికి ఆశలుకల్పించి న ప్రభుత్వం ఇప్పుడు అల్పాహారం పెట్టకపోవడం సరి కాదని విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు గాని విద్యార్థుల తల్లిదండ్రులు గాని ఏ ఒక్కరు కూడా బ్రేక్ ఫాస్ట్ విషయం అడగలేరని స్వయానా సీఎం ప్రకటించి అనంతరం దాని ఊసే తీయకపోవడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు.

దసరా తర్వాతే..

దసరా చివరి వారంలో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం కానుంది. అయితే ప్రతి పాఠశాలకు కావాల్సిన ముడి సరుకులు సర్దుబాటు చేసుకునేందుకు ప్రణా ళికలు రూపొందిస్తున్నాం. అది పూర్తికాగానే తప్పని సరిగా ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు