గురుకుల విద్యార్థులు ఎంపిక
జోనల్, రాష్ట్ర స్థాయి పోటీలకు కాసిపేట గురుకుల విద్యార్థులు ఎంపిక
బెల్లంపల్లి: ఎస్జీఎఫ్ అండర్-14,17,19 కేటగిరీలలో జిల్లా, జోనల్ స్థాయిలో నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో తెలంగాణ సాoఘీక సంక్షేమ పాఠశాల కళాశాల(Telangana Social Welfare School and College) గురుకుల విద్యార్థులు(Students ) అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి, జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ వూటూరి సంతోష్ కుమార్ తెలిపారు.
అథ్లెటిక్స్ విభాగంలో జి. కిరణ్, ఎ.మధు, టి. సిద్దార్థ జోనల్ స్థాయి పోటీలకు డి. చైతన్య,సాఫ్ట్ బాల్ ,బి. ఆద్విక్ చదరంగం, బి. తిరుపతి హ్యాండ్ బాల్, ఎ.చైతన్య కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారనీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్, గెలుపొందిన క్రీడాకారులనుఅభినందించారు. ఈ కార్యక్రమం లో పిడి కె. హరీష్ , పి ఇ.టి ఏ రాజేందర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.