SGF U-17 కబడ్డీ ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ప్రారంభం
మంచిర్యాల స్పోర్ట్స్, (విజయక్రాంతి): మంచిర్యాల SGF ఆధ్వర్యంలో అండర్ - 17 బాలబాలికల ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక(Kabaddi Selection) పోటీలను మంచిర్యాల పట్టణంలోని TRINITY HIGH SCHOOLలో ఆదివారం మంచిర్యాల డిప్యూటీ మేయిర్ సల్ల రమ్య మహేష్ క్రీడాకారులను పరిచయం చేసుకొని కబడ్డి ఆడి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో SGF సెక్రటరీ యాకుబ్, నిర్మల్ జిల్లా సెక్రటరీ లక్ష్మణ్, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ బిజు కురువిల్లా, PETA TS అధ్యక్ష కార్యదర్శులు R. రాజయ్య, బెల్లం శ్రీనివాస్, నిర్వాహక కార్యదర్శులు J రవి, రవీందర్, సౌమిత్, శిరీష, PDలు మల్లేష్, సంతోష్, శ్రీనివాస రెడ్డి, బోయిని శ్రీనివాస్, విజయ్, సాంబమూర్తి, కార్తీక్, జిల్లా నలుమూలల నుంచి PETలు, PDలు, 300 వరకు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.