ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి

19-10-2026 | 05:56pm

చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి(Chennur Government Community Hospital)ని సోమవారం మంత్రి గడ్డం  వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkatswamy ) ఆకస్మికంగా తనిఖీ చేసి, వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలు, ఉచిత మందులు, భోజన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించి, అదనపు పడకలు, మందుల కొరత, అవసరమైన ఆధునిక వైద్య పరికరాలపై చర్చించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో అలసత్వం వహించవద్దని, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు