పీఎల్ ఆర్ రూ. లక్ష 50వేలు ఇవ్వాలి

02-10-2026 | 05:48pm

విప్లవ కార్మిక సంఘాలు డిమాండ్ 

బెల్లంపల్లి: కోల్ ఇండియా పరిధిలోని నాన్-ఎగ్జిక్యూటివ్ కార్మికులకు చెల్లించే PLR (Performance Linked Reward)  రూ. లక్షా 50 వేలు ఇవ్వాలని విప్లవ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈవిషయమై పై రేపు జరిగే కీలక సమావేశంపై కార్మికుల్లో ఆసక్తి నెలకొందనీ పేర్కొన్నారు. గత ఏడాది ఒక్కో కార్మికుడికి రూ.1,03,000 PLRగా చెల్లించారనీ గుర్తుచేశారు.

ఈసారి PLR మొత్తాన్ని  రేపటి సమావేశంలో కార్మిక సంఘాలు ఈ డిమాండ్ పై యాజమాన్యం ముందుంచాలని కోరారు. పెరుగుతున్న జీవన వ్యయాలు, బొగ్గు ఉత్పత్తిలో కార్మికుల పాత్ర, సంస్థకు వచ్చిన ఆదాయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని PLR పెంచాలన్నారు. 

కోల్ ఇండియా నిర్ణయం  ఎలా ఉంటుందనీ సింగరేణి కార్మికుల్లోనూ ఉత్కంఠ  నెలకొందని తెలిపారు. కోల్ ఇండియా PLR నిర్ణయం అనంతరం సింగరేణి కార్మికులకు చెల్లించే బోనస్‌పై కూడా చర్చలు జరిగే అవకాశం ఉండటంతో కార్మికులు ఈ సమావేశంపై  గంపెడు ఆశ పెట్టుకున్నారని తెలిపారు.

గతేడాది రూ.1.03 లక్షలు అందుకున్న నేపథ్యంలో ఈసారి రూ.1.08 లక్షలు నుంచి రూ.1.10 లక్షల వరకు PLR పెరిగే అవకాశం ఉందనీ అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. పెరిగిన ధరలు కనుగుణంగా 2025-2026  గాను  రేపు జరగబోయే సమావేశంలో (ఒక లక్ష యాభై వేలు) ప్రతి కార్మికుడికి వచ్చే విధంగా చర్చించవలసిన అవసరం ఉందన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులకు కూడా పి.ఎల్.ఆర్ బోనస్ వర్తించే విధంగా కార్మిక సంఘాల నాయకులు చర్చించాలని కోరారు. ఈ సమావేశంలో అంబాల మహేందర్ (SGKS), M. పోచమల్లు  ఏ ఐ ఎఫ్ టీ యూ ( శ్రామిక శక్తి) పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు