రక్షణతో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి

22-10-2026 | 07:53pm

 డైరెక్టర్ పీపీ K వెంకటేశ్వర్లు

నస్పూర్, (విజయక్రాంతి) : రక్షణతో నిర్దేశిత  ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ & ప్లానింగ్ K.వెంకటేశ్వర్లు(K. Venkateswarlu, Director (Projects & Planning), Singareni) అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా పర్యటన సందర్భంగా జీఎం మునిగంటి శ్రీనివాస్ తో కలిసి ఎస్సార్పీ ఓసీ పని ప్రదేశాలను సందర్శించి రోజువారీ ఉత్పత్తి, ఉత్పాదకత తీరుతెన్నులను పరిశీలించారు.

సంస్థ నిర్దేశిత లక్ష్య సాధనకు అనుగుణంగా ఉత్పత్తి సాధనతో పాటు ఏరియా టార్గెట్ సాధనకు ఓసీ అధికారులు, ఉద్యోగులు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా రక్షణతో ఉత్పత్తి, ఉత్పాదకత సాధించాలని కోరారు. SRP OCP కార్యకలాపాలకోసం నూతనంగా కేటాయించిన 6.5 క్యూబిక్ మీటర్ లోడర్ ను హెమ్ సెక్షన్లో లో జీఎం మునిగంటి శ్రీనివాస్ తో  కలిసి పూజ నిర్వహించి ప్రారంభించారు.

యంత్రాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఎస్ ఓ టు జీఎం కృష్ణ ప్రసాద్, ప్రాజెక్ట్ ఆఫీసర్ CH వెంకటేశ్వర్లు, మేనేజర్ I.శ్రీనివాస్, ఏరియా ఇంజనీర్ S సురేష్, ప్రాజెక్ట్ ఇంజనీర్ నాగరాజు, సీనియర్ సర్వేయర్ సంపత్ రెడ్డి,  ఏరియా క్వాలిటీ మేనేజర్ శ్రీధర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు