రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
లక్షేట్టిపేట, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) లక్షేట్టిపేటలో ఎలాంటి అనుమతులు లేకుండా డీసీఎం వ్యాన్ లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరూ వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై గోపతి సురేష్ మంగళవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం రాత్రి సాధారణ వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ ముందు రాష్ట్ర రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మంచిర్యాల వైపు నుంచి లక్షట్ పేట వైపు వస్తున్న టీ ఎస్ 22 టీ 3116 నంబర్ గల డీసీఎం వ్యాన్ లో 34 క్వింటాళ్ల రేషన్ బియ్యంను గుర్తించామన్నారు. వ్యాన్ తో పాటు రేషన్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి, రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న కోట సత్తయ్య, మధుకర్ అనే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.పట్టుకున్న రేషన్ బియ్యం విలువ సుమారు రూ.68 వేల వరకు ఉంటుందన్నారు.