జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక
22-09-2026 | 07:00pm
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల(Telangana Social Welfare Gurukul Boys School), ఆసిఫాబాద్‌లో 9వ తరగతి చదువుతున్న మండే రాష్ట్రపాల్ జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మంచిర్యాల జట్టు ప్రథమ స్థానం సాధించడంలో రాష్ట్రపాల్ ప్రతిభ కనబరిచాడు. ఈ నెల 25 నుంచి 27 వరకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జాతీయ పోటీలు జరగనున్నాయి. ఎంపికైన రాష్ట్రపాల్‌ను ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం, ఎస్.వి.పి. రాజేంద్ర ప్రసాద్, పి డి కోట యాదగిరి , పి ఈ టీ ఎస్. ప్రసాద్ , పి. చంద్రశేఖర్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ బి. కిరణ్ కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు.