ఏడుపాయల వనదుర్గమ్మ అలంకరణలో దోషాలు

11-10-2026 | 09:52pm

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

పాపన్నపేట,అక్టోబర్11: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం(Papannapet Mandal) ఏడుపాయల వనదుర్గామాత(Sri Edupayala Vana Durga Bhavani) సన్నిధిలో ఆదివారం నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రి ఉత్సవాల తొలిరోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అయితే అమ్మవారి అలంకరణలో దోషాలు ఉన్నాయని భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పవిత్రమైన ఉత్సవాల్లో అమ్మవారి అలంకరణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై పండితుల తీరును తప్పుబడుతూ పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అలంకరణలో లోపాలు కనిపించడంతో నిరాశకు గురయ్యారు. ఉత్సవాల నిర్వహణలో, ముఖ్యంగా అమ్మవారి అలంకరణ విషయంలో సంబంధిత పండితులు మరింత శ్రద్ధ వహించాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు