ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, బూట్ల పంపిణీ
నర్సాపూర్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ఉచిత యూనిఫాం, బూట్లను శుక్రవారం చిన్న చింతకుంట, బ్రాహ్మణపల్లి గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల(students)కు పంపిణీ చేశారు. చిన్నచింతకుంట గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫాం, బూట్లను గ్రామ సర్పంచ్ సరిత మహేష్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు పాఠశాలకు అవసరమైన యూనిఫాం, బూట్లను ప్రభుత్వం అందించడం పట్ల పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయురాలు కల్పన, ఉపసర్పంచ్ పెంటయ్య, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్, శ్రీకాంత్ రెడ్డి, యట శివయ్య తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణపల్లి గ్రామం లోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన యూనిఫాం, షూస్‌ను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ ఆనంద్ యాదవ్, లావణ్య పాల్గొని విద్యార్థులకు యూనిఫాం, షూస్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంబాబు, ఉపాధ్యాయులు శంకర్, యోగి తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, బూట్లు అందించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందడంతో పాటు, పాఠశాలల్లో సమానత్వ భావనకు ప్రోత్సాహం లభిస్తుందనీ గ్రామస్తులన్నారు.