టిఫిన్ సెంటర్ లో గుర్తుతెలియని వ్యక్తి మృతి.
17-10-2026 | 09:56pm
రామాయంపేట,(విజయక్రాంతి): రామాయంపేట పట్టణంలోని ఓ టిఫిన్ సెంటర్(Ramayampet Tiffin Center)లో టిఫిన్ చేస్తూ గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పట్టణం లోని సిద్దిపేట రోడ్డు(Siddipet Road)లో ఉన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తుండగానే వ్యక్తి కుప్పకూలి మృతి చెందాడని తెలిపారు.ఈ విషయమై పోలీసులు పంచనామా నిర్వహించి ప్రభుత్వ దవాఖానా మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. మృతుడి ఆచూకి కోసం మార్చురీలో ఉంచినట్లు రామాయంపేట ఎస్సై. బాల రాజు తెలిపారు.