భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు
చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial district) చెన్నూర్ పట్టణంలోని గోదావరి తీరం వద్ద కొనసాగుతున్న పుష్కర ఘాట్ పనుల(Pushkar Ghat works)ను జిల్లా కలెక్టర్, చెన్నూర్ తహసిల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్(Municipal Commissioner Maruti Prasad), చైర్మన్ పెద్దింటి పద్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అజ్మత్ అలీలతో కలిసి శనివారం పరిశీలించారు.
పుష్కర ఘాట్ ఏర్పాటు పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని చెరువు వద్ద పర్యాటక ప్రాంత అభివృద్ధి అంశంపై పరిశీలించారు. పట్టణంలోని మదన పోచమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల, దేవాదాయ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.