మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో చేపట్టిన అనధికార నిర్మాణం
చేపట్టిన నిర్మాణాన్ని సీజ్ చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు
తూప్రాన్, అక్టోబర్ 24, (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు, రావెల్లిలో అక్రమ నిర్మాణాలు(Illegal constructions) చేపట్టినట్లు గుర్తించిన అధికారులు, అనధికార నిర్మాణంపై జిల్లా టాస్క్ఫోర్స్ బృందం(District Task Force Team) శనివారం చర్యలు చేపట్టింది. సంబంధిత మున్సిపల్ నోటీసులు(Municipal Notices), అధికారిక ఆదేశాలు, వర్తించే చట్టపరమైన నిబంధనల ప్రకారం సదరు నిర్మాణాన్ని సీజ్ చేసి, తదుపరి నిర్మాణ పనులు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ ప్రత్యేక తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, ఉన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో భవన నిర్మాణాలు చేపట్టే వారు సంబంధిత అనుమతులు పొందిన తరువాతే నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లయితే, జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం చట్ట పరంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.