మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా సంతోష్ కుమార్

24-10-2026 | 08:55pm

నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): జాతీయ మానవ హక్కులు, సామాజిక న్యాయ కమిషన్ నాగల్‌గిద్ద మండల చైర్మన్‌గా గోప్య నాయక్ తండా సర్పంచ్ రామావత్ సంతోష్ కుమార్ నియమితులయ్యారు. నారాయణఖేడ్‌లోని కమిషన్ కార్యాలయంలో ప్రతినిధులు ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కమిషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమిషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, తండా వాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు