రవీంద్ర భారతిలో పండుగ సాయన్న జయంతి వేడుకలు

22-10-2026 | 10:11pm

రామాయంపేట ఉద్యమ నేత అశ్వినికి మంత్రి వాకిటి శ్రీహరి ఘన సన్మానం..

“మీ లాంటి ఉద్యమ నేతలు నేటి సమాజానికి ఎంతో అవసరం”: మంత్రి వ్యాఖ్యలు.

రామాయంపేట,(విజయక్రాంతి): సమాజ హక్కుల కోసం గొంతెత్తే ఉద్యమ నేతలకు ప్రభుత్వ వేదికపై గుర్తింపు లభించింది. మహాత్మ పండుగ సాయన్న జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో రామాయంపేటకు చెందిన ఉద్యమ నేత పోచమ్మల అశ్వినిని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సన్మానించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే ఉద్యమ నాయకులు సమాజానికి అవసరమని మంత్రి పేర్కొన్నట్లు అశ్విని తెలిపారు. ఈ సందర్భంగా ప్రాంతంలోని పలు ప్రజా సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు