గాంధీ జయంతి సందర్బంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం

02-10-2026 | 08:41pm

కూకట్ పల్లి, అక్టోబర్ 02,(విజయక్రాంతి):మహాత్మా గాంధీ జయంతి ని స్వచ్చ్ భారత్ కార్యక్రమం లో(Swachh Bharat cleanliness drive) భాగంగా శంశీగూడ డివిజన్ లోని విజయాంజనేయస్వామి దేవాలయం వద్ద బిజెపి శ్రేణులు శుక్రవారం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతే సమాజ ఆరోగ్యానికి పునాది అని, స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి పరిశుభ్రమైన సమాజ నిర్మానానికి కృషి చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపి డివిజన్ అధ్యక్షులు టప్ప రఘురాం,స్టేట్ కౌన్సిల్ సభ్యులు కేశవరావు,మేడ్చల్ జిల్లా కార్యదర్శి మణిభూషణ్,కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు