7 September, 2026 | 6:06 AM

రియల్ ఎస్టేట్ వివాదంతో కారుకు నిప్పు

07-09-2026 | 05:15am

సాంకేతిక ఆధారాలతో నిందితుడి అరెస్ట్

రాజకీయ కోణం లేదన్న పోలీసులు

కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): రియల్ ఎస్టేట్(Rreal Estate) వ్యాపారంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని భయపెట్టేందుకు అతడి కారుకు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడిని బాచుపల్లి పోలీసులు(Bachupally Police) అరెస్టు చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలను గుర్తించి కేసును ఛేదించినట్లు కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబరు 3న రాత్రి 7.15 గంటల సమయంలో బాచుపల్లి జీపీఆర్ వెంచర్ వద్ద పార్కు చేసి ఉన్న టయోటా ఫార్చ్యూనర్ కారుపై గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కారు రెండు తలుపులు, వెనుక టైరు కాలిపోయి వాహనం తీవ్రంగా దెబ్బతింది. బాధితుడి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలతో  చందానగర్ హుడా కాలనీకి చెందిన అద్దుల అశోక్ రెడ్డి (47) నిందితుడిగా గుర్తించారు. ఫిర్యాదుదారుడితో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్లాట్ల కొనుగోలు, విక్రయాలకు సంబంధించి వివాదం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడిని భయపెట్టాలనే ఉద్దేశంతో అశోక్రెడ్డి పెట్రోలు బంకు నుంచి రెండు సీసాల్లో పెట్రోల్ తీసుకుని, కారులో జీపీఆర్ వెంచర్కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

అక్కడ ఫార్చ్యూన్ప పెట్రోల్ పోసి నిప్పంటించిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. ఘటన అనంతరం నిందితుడు ఉపయోగించిన బీవైడీ కారును అమీన్పూర్లోని గోల్డెన్ కీ అపార్ట్మెంట్స్ వద్ద నిలిపి, అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలు నిందితుడి కదలికలను పర్యవేక్షించి సెప్టెంబరు 5న అదుపులోకి తీసుకుని అరెస్టు చేశాయి. అతడు ఉపయోగించిన బీవైడీ కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.

మరిన్ని వార్తలు