సర్కిల్ అభివృద్ధియే.. లక్ష్యంగా పనులను వేగవంతం చేయండి

27-10-2026 | 06:42pm
  1. నాలా అభివృద్ధి పనులను వేగవంతం చేయండి. 
  2. మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి. 

జవహర్ నగర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): కీసర సర్కిల్ అభివృద్ధియే లక్ష్యంగా వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సర్కిల్ పరిధిలోని పరసరాలను స్వచ్ఛత గా పరిశుభ్రంగా ఉంచండని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి(Malkajgiri Municipal Commissioner Vinay Krishna Reddy) ఆదేశించారు.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ యాప్రాల్, దమ్మాయిగూడ పరిధిలో వివిధ అభివృద్ధి పనులను మున్సిపల్ సిబ్బందితో కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదిగేలా కృషి చేసేందుకు సిబ్బంది కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సర్కిల్ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతూ అభివృద్ధిలో ముందంజలో ఉండడం ముదాబావమన్నారు. స్వచ్ఛత పరిశుభ్రతలో దేశానికే ఆదర్శంగా మల్కాజిగిరి కార్పొరేషన్ నిలుస్తుందని, పౌరులు తడి చెత్త పొడి చెత్తను వేరుచేసి డస్ట్ బిన్లలో వేయాలని సూచించారు. శుభ్రత పరిశుభ్రత లో ఆరోగ్యకరమైన నిబంధనలు పాటించి ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలని సూచించారు.

అనంతరం యాప్రాల్, దమ్మైగూడ పరిధిలోని వివిధ ప్రాంతాలను పరిశీలించి నాలా అభివృద్ధి పనులు, జంక్షన్ అభివృద్ధి పనులు, స్వచ్ఛబడి పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కీసర డిప్యూటీ కమిషనర్ రామలింగం, ఎస్ డబ్ల్యూ ఎం డిఈ, సంతోష్, మెయింటెనెన్స్ డి ఈ మాధవాచారి, పద్మలత, అనిల్, టౌన్ ప్లానింగ్ అధికారులు  తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు