పార్కు స్థలాలను రక్షిస్తాం

10-09-2026 | 12:48am

హైడ్రా అధికారి బాల గోపాల్ హామి

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మునిసిపల్ కార్పొరేషన్ పట్టణాలలోని ప్రజా ఆస్తులైన పార్కులు, చెరువుల రక్షణ తమ లక్ష్యమని హైడ్రా అధికారి వి.బాల గోపాల్(Hydra officer Balagopal) చెప్పారు. మేడ్చల్ 297 వ డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీలోని 200 గజాల పార్కు స్థలం ఆక్రమణ గురించి కాలనీ అసోసియేషన్ సభ్యులు హైడ్రా ప్రజావాణి కార్యక్రమం(prajavani program)లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయపై స్పందించిన హైడ్రా అధికారులు మేడ్చల్ కు వచ్చి పార్కు అక్రమాలపై విచారణ జరిపారు.

పార్కుకు సంబంధిన అన్ని రికార్డులు దస్తావేజులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా అధికారి బాల గోపాల్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోను పార్కును కాపాడి అసోసియేషన్ కు అప్పగిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. శ్రీనివాస నగర్ కాలనీలోని పార్కు స్థలాన్ని అసోసియేషన్ సభ్యులకు అప్పగిస్తామని చెప్పిన హైడ్రా అధికారి బాల గోపాల్ పై హర్షం వ్యక్తం చేసి శాలువాతో సత్కరించారు. 

మరిన్ని వార్తలు