స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి

10-09-2026 | 12:55am

సదాశివనగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలను(Welfare schemes) లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సదాశివనగర్ మండ‌లం(Sadashivanagar Mandal) వజ్జెపల్లి తండా గ్రామ‌ సర్పంచ్ మాలోత్ సంధ్య-విజయ్ కుమార్ అన్నారు. బుధవారం తండాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ కార్డులను(smart ration cards) గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లబ్ధిదారుల పూర్తి వివరాలతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డును ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కార్డుల పంపిణీతో అర్హులైన కుటుంబాలకు సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవీందర్, పంచాయతీ సెక్రటరీ శ్రీజ, వార్డు సభ్యులు, తండా నాయకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు