ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం నిర్వహణ
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి అంకుషాపూర్(Ankushpur)లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మహేంద్రహిల్స్‌లో జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని(National Ayurveda Day) బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) డాక్టర్ నీలోజి సరోజ విద్యార్థులకు ఆయుర్వేద దినచర్యపై అవగాహన కల్పించారు.
ఆరోగ్యకరమైన ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, క్రమబద్ధమైన జీవనశైలి, యోగా, ప్రకృతికి అనుగుణంగా జీవించడం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మి అసిరెడ్డి మాట్లాడుతూ ఆయుర్వేదాన్ని ఆరోగ్యకరమైన జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని విద్యార్థులకు(Students) సూచించారు. అనంతరం విద్యార్థులందరితో ఆయుర్వేదాన్ని మా జీవితంలో ఒక భాగంగా చేసుకుంటాం అని ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.