ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు

22-10-2026 | 08:01pm

ఘట్ కేసర్, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ ముదిరాజ్(Chandrashekhar Mudiraj, President of the Mudiraj Association) ఆధ్వర్యంలో గురువారం పండుగ సాయన్న ముదిరాజ్(Panduga Sayanna Mudiraj) 174వ జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పసులాది చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తొలిసారిగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.ప్రజా జీవితాన్నే తన జీవితంగా మలుచుకుని, అణగారిన వర్గాల అభ్యున్నతి, నిరుపేదల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు పండుగ సాయన్న అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో  మేడబోయిన నరేష్ ముదిరాజ్, చింతల శంకర్ ముదిరాజ్, అర్ముళ్ల బాలసుందర్ ముదిరాజ్, దాసబోయిన నాగరాజ్  ముదిరాజ్, కోరబోతు శివానంద్ ముదిరాజ్, దాసబోయిన నవీన్ ముదిరాజ్, భార్గవ్ ముదిరాజ్, పాల్గొనడం  జరిగింది.

రాధాకృష్ణ ఆధ్వర్యంలో

ఘట్ కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్, నాయకులు గుండ్ల బాల్ రాజ్ ముదిరాజ్, మాజీ వార్డు సభ్యులు కోరుబోతూ నాగరాజు ముదిరాజ్, జవాజీ సత్తయ్య ముదిరాజ్, గంట సత్యనారాయణ ముదిరాజ్, బర్ల కిష్టయ్య ముదిరాజ్,రెడ్డబోయిన శ్రీశైలం ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు