మల్కాజిగిరి జోనల్ ప్రజావాణిలో 27 ప్రజా ఫిర్యాదులు

07-09-2026 | 11:34pm

'ప్రజావాణి'లో వచ్చిన  ఫిర్యాదులన త్వరగా పరిష్కరించాలి :  జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్

మల్కాజిగిరి,(విజయ క్రాంతి): 'ప్రజావాణి'(Prajavani)లో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలను  పరిష్కరించాలని జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్(Malkajgiri Zonal Commissioner Sanchit Gangwar)  ఆదేశించారు. సోమవారం మల్కాజిగిరి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం(Prajavani program) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి జోన్ పరిధిలోని వివిధ సర్కిళ్లకు చెందిన ప్రజల నుంచి మొత్తం 27 ప్రజా ఫిర్యాదు లు స్వీకరించారు. ఇందులో మల్కాజిగిరి సర్కిల్ – 07, మౌలాలి సర్కిల్ – 01, కీసర సర్కిల్ లో –19 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా జోనల్  కమిషనర్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ... ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై త్వరి తగతిన చర్యలు తీసుకుని, ప్రజలకు సత్వర ఉపశమ నం కల్పించాలని సంబం ధిత విభాగాల అధికారు లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, ఎస్‌ఈ బి. శ్రీధర్ రావు, డీడీ (యుబీడీ) టి. ప్రశాంతి, డీఈఈ టి. సంజయ్, వెటర్నరీ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు