అమలులో కాంగ్రెస్‌ విఫలం

08-09-2026 | 12:13am

నర్సాపూర్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress government)పై బీఆర్‌ఎస్‌ సమరశంఖం పూరించింది. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో హత్నూర ఎంపీడీవో కార్యాలయం(Hatnura MPDO Office) ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్‌(BRS) నేతలు మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు, మాజీ ఎంపీపీ వావిలాల నరసింహులు, మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్‌గుప్తా, నరసింహారెడ్డి, వీరేశంగౌడ్‌, పండుగ రవికుమార్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నర్సాపూర్ లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

నల్లచొక్కాలతో అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను అడ్డుకోవడంపై నిరసన

అసెంబ్లీ సమావేశాలకు నల్లచొక్కాలతో వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. సోమవారం ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే దిష్టిబొమ్మ దహనం పూర్తయింది. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ దుర్గప్పగారి అశోక్‌గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు పంబల్ల బిక్షపతి, కౌన్సిలర్‌ బుల్లెట్‌ రాజు, నాయకులు సత్యంగౌడ్‌, రాకేష్‌గౌడ్‌, మురళి, సురేష్‌గౌడ్‌, మహేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు