కొండాపూర్ లో వరుస ప్రమాదాలపై ప్రజాగ్రహం

09-09-2026 | 12:03am

రోడ్డుపై బైఠాయించి స్థానికుల ధర్నా

భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ వద్ద ఘట్ కేసర్, కీసర ప్రధాన రహదారిపై వరుస ప్రమాదాలను నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వేగంగా దూసుకెళ్లే వాహనాలు, ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల అతివేగంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజీ నుంచి రోడ్డుపైకి వస్తున్న డ్రైనేజీ నీటిని అరికట్టాలని, స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికులతో చర్చించి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించిన స్థానికులు వెంటనే చర్యలు చేపట్టకపోతే ఘట్ కేసర్ సర్కిల్  కార్యాలయం ఎదుట ధర్నాను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు