నాణ్యమైన ప్రభుత్వ విద్య.. ప్రతి కుటుంబం హక్కు

27-09-2026 | 07:47pm

మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి

గబ్బిలాల పేటలో ప్రభుత్వ స్కూలు నిర్మించాలి

జవహర్ నగర్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): జవహర్ నగర్ పరిధిలోని గబ్బిలాలపేటలో తెలంగాణ పీపుల్స్ ప్రంట్(Telangana People's Front) ఆధ్వర్యంలో గబ్బిలాల పేట స్కూల్ నిర్మాణంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ తెలంగాణలో తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యా వ్యవస్థను రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ (టీపీఫ్) డిమాండ్ చేస్తుందని.అనియంత్రిత ప్రైవేట్ పాఠశాలల ఫీజులు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత వల్ల దాదాపు 40 లక్షల కుటుంబాలు ఆర్థిక భారాన్ని మోస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 63% మంది విద్యార్థులు ప్రైవేట్, 37% మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని మురళి పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఎస్ బోస్  సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడుతూ తెలంగాణ పీపుల్స్ ప్రింట్ ప్రభుత్వ పాఠశాల సాధన కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా సిపిఐ పార్టీ భాగస్వామ్యం అవుతుందని సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు.

టీపీఫ్ ప్రధాన డిమాండ్లు:

ఫీజుల నియంత్రణ చట్టం ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ సిఫార్సుల మేరకు ప్రైవేట్ పాఠశాలల ఫీజులను పర్యవేక్షించేందుకు స్వతంత్ర చట్టబద్ధమైన కమిటీని ఏర్పాటు చేయాలి.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం: 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్' నమూనా ద్వారా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి.

18% బడ్జెట్ కేటాయింపు: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో విద్యా రంగానికి కనీసం 18% నిధులు కేటాయించేలా చట్టపరమైన హామీ ఇవ్వాలి.

ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ ఎంవీ రెడ్డి, మాజీ ఐఏఎస్ ఎం చంపాలాల్, సృజన యాదవ్, షేక్షావలి, సిపిఐ, సిపిఎం నాయకులు గబ్బిలాల పేట కాలనీ ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు