ఇందిరమ్మ బీమా పథకంను సద్వినియోగం చేసుకోవాలి

23-11-2026 | 07:12pm

కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పోచారం డివిజన్ అధ్యక్షులు బద్దం కుమార్

ఘట్ కేసర్, నవంబర్ 23 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరమ్మ బీమా పథకంను(Indiramma Insurance Scheme) ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పోచారం డివిజన్ అధ్యక్షులు బద్దం కుమార్ పేర్కొన్నారు. పోచారం డివిజన్ లో ఇందిరమ్మ బీమా పథకం కౌంటర్ ని సోమవారం బద్దం కుమార్ సందర్శించారు.  ఈకార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు ఎర్ర మాధవి, ఎస్సీ సెల్ డివిజన్ ఉపాధ్యక్షులు సగ్గు మహేష్, కోశాధికారి బద్ధం మల్లికార్జున్ రెడ్డి,  సీనియర్ నాయకులు ఎర్ర రాజు, అన్నోజిగూడ గ్రామ అధ్యక్షులు విజయ్ రెడ్డి పాల్గొని ఈ పథకానికి ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు