అర్హులందరికీ ఇందిరమ్మ బీమా అందేలా చర్యలు తీసుకోవాలి

23-11-2026 | 07:15pm

తంగళ్ళపల్లి,నవంబర్ 23 (విజయ క్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని దేశాయిపల్లి, మల్లాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ బీమా పథకం(Indiramma Insurance Scheme) అమలు తీరును మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగేల రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ బీమా పథకం అందేలా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గట్టు రాజిరెడ్డి, దేవయ్య, తిరుపతి, శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల తిరుపతి, బాబు, బాలకిషన్, ప్రవీణ్, అజయ్, బాలయ్య, పంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు