అక్బర్జపేట్ లో హరిత హారం మొక్కలు ధ్వంసం

06-11-2026 | 07:35pm

మొక్కలను ధ్వంసం చేసిన వ్యక్తులను కటినంగా శిక్షించాలి

మేడ్చల్ అర్బన్ నవంబర్ 6 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని అక్బర్జాపేటలో హరిత హారం(Haritha Haram) కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఓక వైపు నాటిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఇటీవల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని మారినో బిస్కట్ కంపెనీ సమీపం నుండి అక్బర్జాపేట లోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయం వరకు రోడ్డుకు ఒక హరిత హారం మొక్కలను నాటారు.

ఈ నేపథ్యంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి మొక్కలను నరికి పడేయడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.సుమారు అర్థ కిలోమీటర్ మేరకు 150 కి పైగా నాటిన మొక్కలను ధ్వంసం చేయడంపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి  మొక్కలు నాటుతుంటే వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్థానికులు వాపోయారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి హరిత హారంలో నాటిన మొక్కలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు...

మరిన్ని వార్తలు