మాది అందరికీ నచ్చే ఆదర్శ కుటుంబం

24-10-2026 | 05:00am

విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh), దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయిక కాగా.. నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్ బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకను హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కథానాయకుడు వెంకటేశ్ మాట్లాడుతూ.. “విద్యార్థులు కాలేజ్ జీవితంలో మంచి జ్ఞాపకాలు ఉండేలా చూసుకోండి. కలలను నిజం చేసుకోండి.

కాలేజ్ అంటే డిగ్రీ, జాబ్ మాత్రమే కాదు.. మంచి క్యారెక్టర్‌తో బయటకు రావాలి. అక్టోబర్ 30న మా సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా” అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ప్రేక్షకులు ఊహించిన పద్ధతిలో కాకుండా, వేరే డైరెక్షన్‌లో ఉండే సినిమా ఇది. నార్మల్ రొమాంటిక్ కామెడీ కాకుం డా వేరే వేరే అంశాలనూ చర్చించాం. క్రైమ్ కామెడీ లేదా బ్లాక్ కామెడీ అలాంటివి ట్రై చేశాం. ప్రేక్షకులకూ నచ్చుతుందని ఆశిస్తున్నా” అని తెలిపారు. కథానాయిక శ్రీనిధి శెట్టి మాట్లా డుతూ.. “మనకు జీవితంలో ఎన్నో ప్లాన్స్ ఉంటాయి.

కానీ, లైఫ్ ప్లాన్ మరోలా ఉంటుంది. మనల్ని సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. మా సినిమాలోనూ తర్వాతి సీన్ ఏం జరుగుతుందనే ఆసక్తి ఉంటుంది. ఇంత మంచి సినిమాలో అవకాశమిచ్చి, ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇచ్చిన త్రివిక్రమ్‌కి కృతజ్ఞతలు. వెంకటేశ్ లాంటి లెజెండ్‌తో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నా” అని చెప్పింది. సంగీత దర్శకుడు తమన్, బాల నటుడు రాజ్ ప్రజ్వల్, యువినా కూడా ఈ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్నారు. 


మరిన్ని వార్తలు