అక్షర్ హీరోగా శూలధారి

23-10-2026 | 05:00am

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో ఆసక్తికరమైన చిత్రంగా ‘శూలధారి’ తెరకెక్కనుంది. స్వాక్ష పిక్చర్స్, గూగుడు కుళ్ళాయి స్వామి క్రియేటివ్ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షర్(Akshar) హీరోగా నటిస్తుండగా, స్వాతి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అశ్వథ్ సూర్య కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా, నజీర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నలుగురు ప్రధానంగా నిలవనున్న ఈ ప్రాజెక్ట్స్ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రానికి అక్షర్ కథను అందిస్తున్నారు.

బాలచంద్ర శర్మ స్క్రీన్‌ప్ల్లే, సంభాషణలను సమకూరుస్తున్నారు. కథకు తగ్గట్టుగా సంగీతం, యాక్షన్ అంశాలను సమన్వయం చేస్తూ చిత్రాన్ని రూపొందించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు గౌరి శంకర్, రవి మాస్టర్ ఫైట్స్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. పాటలను లక్ష్మణ్ (లక్ష), అంబట్ల రవి, సూర్య కిరణ్ రచిస్తున్నారు. డ్యాన్స్ కొరియోగ్రఫీ బాధ్యతలను సూర్య, విక్టర్ ఆదిత్య నిర్వహిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను రాజేశ్ కుమార్, హనీలా చేపడుతున్నారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా నాగ శ్రీ వ్యవహరిస్తుండగా, కాస్ట్యూమ్స్ బాధ్యతలను అక్షయ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది.

మరిన్ని వార్తలు