ఏందయ్యా సామీ.. ఐదు భాషల్లో
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం(Pan India film) ‘రణబాలి(Ranabali)’. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers banner)పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విజయదశమి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఏందయ్యా సామీ..’ ఫుల్ సాంగ్ రిలీజ్ గురించి కీలక అప్‌డేట్‌ను మేకర్స్ శుక్రవారం పంచుకున్నారు. ఈ నెల 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ పాటను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
గతంలో విజయ్, రష్మిక పెళ్లి సందర్భంగా విడుదల చేసిన ఈ సాంగ్ ప్రోమో మంచి స్పందన దక్కించుకుంది. ఇప్పుడీ సాంగ్ ఫుల్ వెర్షన్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న వివాహం తర్వాత కలిసి నటిస్తున్న సినిమాగా అటు వారి అభిమానుల్లోనూ, ఇటు మూవీ లవర్స్‌లోనూ ఆసక్తి రేకెత్తిస్తోందీ చిత్రం. ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్ వోస్లూ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్ అతుల్; డీవోపీ: నీరవ్ షా, జిష్ణు భట్టాచర్జీ; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్; ఆర్ట్: విఠల్ కోసనం.